వేదాద్రి నరసింహస్వామి ఆలయంలో రేపటి నుండి ఉచిత యోగా శిక్షణ

వేదాద్రి నరసింహస్వామి ఆలయంలో రేపటి నుండి ఉచిత యోగా శిక్షణ
​జగ్గయ్యపేట (వేదాద్రి):
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘యోగాంధ్ర’ కార్యక్రమంలో భాగంగా వేదాద్రి గ్రామ పరిధిలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ యోగానంద లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవస్థానంలో ఉచిత యోగా శిక్షణ తరగతులు నిర్వహించనున్నారు. ఈ మేరకు దేవస్థాన వంశపారంపర్య ధర్మకర్త డాక్టర్ శ్రీమతి వెలగపూడి లక్ష్మణఇందిరా దత్తు, ఆలయ కార్యనిర్వహణాధికారి (ఈఓ) శ్రీ కానూరి సురేష్ బాబు ఆదివారం ఒక ఉమ్మడి ప్రకటనలో తెలిపారు. రేపు (సోమవారం) అనగా జూన్ 8వ తేదీ నుండి జూన్ 21వ తేదీ వరకు ప్రతిరోజూ ఉదయం 7:00 గంటల నుండి 8:00 గంటల వరకు ఈ శిక్షణా కార్యక్రమాలు ఆలయ ప్రాంగణంలో జరుగుతాయని వారు పేర్కొన్నారు. మానసిక ఉల్లాసానికి, శారీరక దృఢత్వానికి యోగా ఎంతో దోహదపడుతుందని, కావున భక్తులు, స్థానిక ప్రజలు, ఆసక్తి గల వారందరూ ఈ ఉచిత అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు.