జూన్ 8వ తేదీ (సోమవారం) ఉదయం 7:00 గంటల నుండి ఎమ్మెల్యే జగ్గయ్యపేటలోని తన నివాసంలో అందుబాటులో ఉండరని ఎమ్మెల్యే కార్యాలయం తెలిపింది

అమరావతి నామినేషన్ కార్యక్రమానికి వెళ్లనున్న ఎమ్మెల్యే శ్రీరాం తాతయ్య
​జగ్గయ్యపేట, జూన్ 7 యువ గళం న్యూస్: జగ్గయ్యపేట శాసనసభ్యులు, తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య) సోమవారం అమరావతిలో పర్యటించనున్నారు. రాజధాని అమరావతిలో నిర్వహించనున్న రాజ్యసభ సభ్యుల నామినేషన్ల దాఖలు కార్యక్రమంలో ఆయన పాల్గొననున్నారు.
​ఈ నేపథ్యంలో జూన్ 8వ తేదీ (సోమవారం) ఉదయం 7:00 గంటల నుండి ఎమ్మెల్యే జగ్గయ్యపేటలోని తన నివాసంలో అందుబాటులో ఉండరని ఆయన కార్యాలయ వర్గాలు ఒక ప్రకటనలో తెలిపాయి. నియోజకవర్గ పరిధిలోని ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు, కార్యకర్తలు మరియు ప్రజలు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని కార్యాలయ ప్రతినిధులు కోరారు.